PM Narendra Modi Address Nation, Big Announcements Expected | 6 PM Live | Oneindia Telugu

2020-10-20 533

Prime Minister Narendra Modi will address the nation at 6 pm on Tuesday.

#PMNarendraModiAddressNation
#PMModiSpeech
#Coronavirus
#IndiachinaFaceoff
#ModiBigAnnouncements
#COVID19crisis
#Coronavirusvaccine
#IndiaEconomy
#ModiAddressNation

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజల ముందుకు రాబోతున్నారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ప్రసంగం ఉండబోతోంది. ఏ అంశం మీద ఆయన ప్రసంగిస్తారనేది స్పష్టంగా తెలియరావట్లేదు. ఈ సాయంత్రం 6 గంటలకు తాను దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాను.. అంటూ ఓ సంక్షిప్త సమాచారాన్ని వెల్లడించారు. దీన్ని కొద్దిసేపటి కిందటే ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.కరోనా వైరస్ వ్యాప్తిచెందడం ఆరంభమైన తొలి రోజుల నుంచీ దశలవారీగా ఆయన తరచూ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వచ్చారు. వివిధ దశల్లో ఆయన కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని రావడానికి తరచూ దేశ ప్రజల ముందుకొచ్చేవారు. కరోనా వైరస్ సంక్షోభంలో చిక్కుకున్న వేర్వేరు రంగాలను ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తరువాత.. ఆయన మళ్లీ దేశ ప్రజల ముందుకు రావడం తగ్గింది